మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లలో బిజీగా సమయాన్ని గడుపుతుంది. అందులో భాగంగా ఈమె వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మరియు మరికొన్ని ఇతర విషయాలను కూడా తెలియజేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తనకు నచ్చిన మూడు మూవీ ల గురించి చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూ లో కాజల్ మాట్లాడుతూ ... నేను నా కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించాను. అందులో కొన్ని అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే నాకు నా కెరియర్ మొత్తంలో మూడు సినిమాలు అంటే ఇష్టం అవి బ్రహ్మోత్సవం , సీత , సత్యభామ అని ఈమె చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పటికే బ్రహ్మోత్సవం , సీత సినిమాలు విడుదల కాగా సత్యభామ సినిమా మే 31 వ తేదీన విడుదల కానుంది. బ్రహ్మోత్సవం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన కాజల్  అగర్వాల్ , సమంత , ప్రణీత ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. ఇకపోతే సీత సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్మూవీ లో హీరో గా నటించగా ... తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ ముద్దు గుమ్మ చెప్పిన మూడు సినిమాలలో రెండు విడుదల అయ్యి రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మరి సత్యభామ సినిమా కూడా కాజల్ కి ఇష్టం అంటుంది. మరి ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: