బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరో గా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణు లలో ఒకరు అయినటువంటి సాయి పల్లవి హీరోయిన్ గా నితీష్ తివారి దర్శకత్వం లో రామాయణ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . ఈ సినిమా లో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం పూర్తి కూడా అయింది. 

గత కొంతకాలంగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం వేడుకను చూపించబోతున్నట్లు , రెండవ భాగంలో సీత పహరణం చూపించబోతున్నట్లు , మూడవ భాగంలో సీతను తీసుకురావడం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లోని మొదటి భాగం కనుక విడుదల అయ్యి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోగలిగినట్లు అయితే మిగిలిన రెండు భాగాలపై కూడా జనాలు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న రామాయణ మొదటి భాగం విడుదల తేదీని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk