తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ ఉండబోతున్నట్లు చాలా రోజుల క్రితం ఓ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ అనౌన్స్మెంట్ వచ్చాక సుకుమార్ "పుష్ప" సినిమాతో బిజీ అయ్యారు. విజయ్ దేవరకొండ ఇతర సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. దానితో ఈ సినిమా లేనట్లే అని అంతా భావించారు. కానీ మళ్ళీ తాజాగా ఈ సినిమా ప్రస్తావన తెరపైకి వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన గం గం గణేశా సినిమా ప్రమోషన్ లలో భాగంగా నిర్మాత కారుమంచి మాట్లాడుతూ ... ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ "పుష్ప 2" సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత సుకుమార్ , విజయ్ దేవరకొండ కాంబో లో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇలా ఇన్ని రోజుల పాటు ఇక లేదు అనుకున్న ప్రాజెక్ట్ ఇంకా ఉంది అని తెలియడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం చేస్తున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల అయిన కొంత కాలానికి సుకుమార్ , రామ్ చరణ్ తో మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు.

సినిమా కూడా చాలా తక్కువ కాలం లోనే పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. అంతలోపే విజయ్ కూడా ఈ సినిమాలను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ కాగానే వీరి కాంబో లో మూవీస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: