టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. ఈయన తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు . కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు . గోపీ చంద్ ఈ సినిమాలో డ్యూయల్ పాత్రలలో నటించి తన నటన తో ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా తాజాగా విలువడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ చానల్లో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పటికే థియేటర్ మరియు ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc