భారీ బడ్జెట్ సినిమాలను , స్టార్ హీరోలతో సినిమాలను చాలా త్వరగా పూర్తి చేసే దర్శకులలో ప్రశాంత నీల్ ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండియా వ్యాప్తంగా ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది. కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ దశలో ఉండగానే ఈ దర్శకుడు ప్రభాస్ లో సలార్ మూవీ ని అనౌన్స్ చేశాడు. ఓ వైపు కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాను చిత్రీకరిస్తునే మరో వైపు సలార్ సినిమాను కూడా చిత్రీకరించాడు. ఇకపోతే మరోసారి కూడా అలాంటి ప్రయోగమే ఈ దర్శకుడు చేయబోతున్నాడు.

కొన్ని రోజుల క్రితం ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన సలార్ మొదటి భాగం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కాకముందే ఎన్టీఆర్ హీరోగా కూడా ఓ మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో లో మూవీ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇక నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఎన్టీఆర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు నుండి ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దానితో ఒక వైపు సలార్ పార్ట్ 2 షూటింగ్ ను రూపొందిస్తూనే మధ్యలో ఎన్టీఆర్ మూవీ షూటింగ్ కూడా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఒక వైపు ప్రభాస్ మరో వైపు ఎన్టీఆర్ ఇలా ఇద్దరు హీరోలను ఒకే టైం లో ప్రశాంత్ హ్యాండిల్ చేయగలడా అని అనుమానాలు కొంత మంది సినీ ప్రేమికుల్లో మరియు ప్రభాస్ , ఎన్టీఆర్ అభిమానుల్లో రేకెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: