ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటారు విజయశాంతి రీఎంట్రీలోనూ అదరకొడుతున్నారు. ఈ లేడీ సూపర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు.గతంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. విజయ శాంతి చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇప్పుడు కూడా స్టార్ హీరోల సినిమాల్లో చేస్తోంది. అయితే ఆచి,తూచి ముందుకు వెళ్తోంది.మహేష్ తో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఆమె వద్దకు చాలా మంది దర్శకులు స్క్రిప్టులతో వెళ్లినా.. సున్నితంగానే ఆమె తిరస్కరించారు. దీంతో ఆమె మళ్లీ సినిమా చేయడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేశారు. ఏ సినిమా? హీరో ఎవరు? అంటే రామ్ చరణ్ సినిమా అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో విజయశాంతిని తీసుకోబోతున్నారని టాక్. పవర్ ఫుల్ గా సాగే ఆ లేడీ క్యారెక్టర్ లో సీనియర్ హీరోయిన్ విజయశాంతి అయితే ఫెరఫెక్ట్ అని భావిస్తున్నారట. ఆమె పాత్ర చరణ్ కు తల్లి పాత్ర అని, సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం చరణ్ బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: