పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ పూర్తిగా తన పిల్లల బాధ్యత తీసుకుంది.అయితే నిత్యం పవన్ అభిమానులు రేణు దేశాయ్‌ను వదినా మా అన్న పిల్లలను చూపించమని అడుగుతూ పోస్టులు పెడుతుంటారు. దానికి రేణు దేశాయ్, పవన్ కల్యాణ్‌ను అన్నా అని తనని వదిన అనడం బాలేదని ఎన్నోసార్లు తన ఆవేదనను చెప్పుకుంది. అయినప్పటికీ ఫ్యాన్స్ వినిపించుకోకుండా వదినా అంటూ పవన్ కల్యాణ్ టాపిక్ తీసుకొస్తుంటారు. అయితే ఇటీవల రేణు దేశాయ్ జంతువుల కోసం సహాయం చేసిన వారికి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ వారిది కూడా మా పవన్ అన్నలాగా గొప్ప మనస్సు అని పోస్ట్ పెట్టాడు.

దీంతో రేణు దేశాయ్ స్పందించి నేనే సొంతంగా ఏ మంచి చేసినా అతని పేరు మధ్యలోకి తీసుకొస్తున్నారు. నాలాగా అతనికి జంతువులపై ప్రేమ లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక అది చూసిన పవన్ అభిమానులు రియాక్ట్ అవుతూ వరుస పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్.. లుక్ బ్యూటిఫుల్.. మేడమ్ అయితే నేను నిన్న మీ కథకు సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇకపై పవన్ మీరు ఒకరికొకరు సంబంధించిన విషయాల గురించి చెప్పారు. అతను జంతువును ప్రేమిస్తాడు. నేను ఈ మాట కచ్చితంగా చెప్పగలను. మీరు అతని పిల్లలకు తల్లి అయి ఉండి ఇలా మాట్లాడకండి. ఇలాంటి నోట రాయడం మాకు చాలా బాధగా ఉంది. మీరిద్దరు కుటుంబంలా ఉన్నారని మాకు అనిపిస్తుంది. కాబట్టి అతనితో మంచిగా ఉండండి.

మీరు ఇప్పటికీ బాధ్యతను మోస్తున్నట్లు అనిపిస్తుంది. పవన్ భార్యగా నేను మిమ్మల్ని బాధపెట్టే విధంగా ఏదైనా చెబితే క్షమాపణలు. మీకు మీ పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. దీంతో రేణు దేశాయ్ ఈ పోస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ''నేను శ్రీమతి అనను కాబట్టి అతని భార్య బాధ్యతను నేను మోయను. రెండవది అతను నాలాగే జంతువులను ప్రేమిస్తున్నాడని మీకు ఎలా తెలుసు? ఈ 55 ఏళ్లలో అతను జంతు సంరక్షణ కోసం ఏం చేశాడు? అతనికి కుక్క, పిల్లి లాంటి ఇంట్లో పెంపుడు జంతువు కూడా లేదు. కాబట్టి దయచేసి సంవత్సరాలు, సంవత్సరాలుగా నన్ను మానసికంగా దుర్భాషలాడటం కంటే మీ అవాంఛనీయ ఉపన్యాసాలు, అభిప్రాయాలను అతని ఖాతాలోకి తీసుకోండి'' అని ఫైర్ అయింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: