వరుస సినిమాలు చేసే సమయంలో పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో సినిమాలకు కొద్ది రోజులపాటు గుడ్ బై చెప్పింది. కాజల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కూడా తనకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరస సినిమాలు చేస్తుంది. పోయిన ఏడాది భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా మరొక సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో తను నటించిన పాత్ర చిన్నదే అయినా కూడా మంచి

 గుర్తింపును తెచ్చుకుంది. ఇదే ఇదిలా ఉంటే తాజాగా కాజల్ నటించిన సత్యభామ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఇండియన్ టు సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా కోసం ఆమె భారీ సాహసమే చేసిందట. ప్రస్తుతం తను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ." బాబు పుట్టిన రెండు నెలలకే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను.

 ఇండియన్ 2 సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక ఆ టైంలో నేను చాలా పెయిన్ భ రించాను. అయినప్పటికీ కూడా కష్టపడి నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. దాదాపుగా ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితం ఓకే చెప్పాను. నేను ఈ సినిమా నో అనుకుంటే వాళ్లు వేరే వాళ్ళని తీసుకుంటారు. కానీ నేను ఆ సినిమా చేయాలనుకున్నాను. డైరెక్టర్ సర్ కూడా నాకు టైం సెట్ అయ్యేలా డేట్స్ అడ్జస్ట్ అయ్యేలా ప్లాన్ చేసి సపోర్ట్ చేశారు. నేను నీ ప్లేస్ లో వేరే హీరోయిన్ తీసుకోను.. నువ్వు అసలు భయపడకు అని చెప్పారు. చాలా కష్టంగా ఉన్నా సరే ఎంతో ఇష్టంతో చేశాను. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా కాజల్ మాట్లాడిన వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: