సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం దగ్గర నుండి పిల్లల్ని కనడం వరకు నిత్యం వాళ్లకి సంబంధించిన వందల రూమర్స్ సోషల్ మీడియాలో వినబడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించిన వార్తలు కూడా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి. ఆ బ్యూటీ మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి

 తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు కత్రినా. అటు విక్కీ కౌశల్ సైతం ఈ విషయంపై స్పందించలేదు. అయితే తాజాగా కత్రినా కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో చూసిన తర్వాత నిజంగానే కత్రినా గర్భవతి అని అందరూ ఫిక్స్ అయిపోయారు.  కత్రినా విక్కి ప్రస్తుతం లండన్ లో

 ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట లండన్ రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. అక్కడ చాలా మందికి తెలియదు కాబట్టి ఈ జంట స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించారు. అయితే, కొందరు కత్రినా, విక్కీ కలిసి తిరుగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో కత్రినా కైఫ్ బ్లాక్ బ్లేజర్ ధరించి కనిపించింది. అలాగే ఆమె కడుపు భాగం ఎత్తుగా కనిపిస్తోంది. దాంతో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'కత్రినా కైఫ్ గర్భవతి' అని కొందరు అన్నారు. కొంతమంది అది కత్రినా కాదు అని అంటున్నారు. కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ బిడ్డకు జన్మనివ్వనున్నారని ఈ మధ్య పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా ఉంది. 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కత్రినా కైఫ్ కొత్త ఏదీ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: