టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా కనిపించబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు నాగచైతన్య. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..

 "పాకిస్తాన్ ప్రదేశిక  జలాల వెంబడి పట్టుబడి రెండేళ్ల పాటు జైలు శిక్షణ అనుభవించి భారతదేశానికి తిరిగి వచ్చిన రాజు అనే వ్యక్తి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రాబోతోంది.. ఇక ఈ పాత్ర కోసం నేను దాదాపుగా 9 నెలలు ప్రిపేర్ అయ్యాను అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అంతేకాదు రాజు ఇంటికి నేను స్వయంగా వెళ్లాను అని అతడి ధైర్య సాహసాలు సంకల్పం గురించి తెలుసుకొని షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు. మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకునేందుకు వారితో చాలా సమయం  గడిపాను అని చెప్పాడు.

 అంతేకాదు నా కెరియర్ లోనే ఇది అతి పెద్ద సినిమా అని చెప్పాడు. ఆ పాత్ర నాకు కావాలి... అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ ఇది అంటూ వెల్లడించాడు. అంతేకాదు శ్రీకాకుళం యాసతో పాటు ప్రతిదీ ఈ సినిమా కోసం నేను పర్ఫెక్ట్ గా చేయాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. తండేల్‌ డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తండేల్‌ 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాప్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: