టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొత్త కొత్త యంగ్ హీరోలో పరిచయం అవుతూనే ఉన్నారు. చాలా మంది టాలెంట్ ఉన్న కుర్ర హీరోలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తమ సత్తా ఏంటో చూపించుకుంటున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు.  కొందరు వరుసగా హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంటుంటే కొందరు మాత్రం ఫ్లాప్స్ అందుకుంటున్నారు. అయినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలె అంటున్నారు. ఇక అందులో ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలో తేజ సజ్జ సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ వంటి హీరోలు ముందు వరుసలో ఉన్నారు. ఇక ఈ యంగ్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే రెమ్యూనరేషన్ సైతం భారీగా పెంచేసినట్లు గా వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు యంగ్ హీరోలు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయం తెలుసుకుందాం.
 
తేజ సజ్జ

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి గాను 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట తేజ.  హనుమాన్ సినిమా తర్వాత మిరాయి అనే సినిమా చేస్తున్నాడు.
 

విశ్వక్ సేన్

టాలీవుడ్ లో మాస్ కా దాస్ విశ్వక్సేన్ గా పేరు తెచ్చుకున్న ఈయన గామి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి గాను 20 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం వినబడుతోంది .

సిద్ధూ జొన్నలగడ్డ

 ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు ఈ యంగ్ హీరో. టిల్లు సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి గాను 20 నుండి పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: