తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈమె వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో అభిమానులు ఉండడం మంచిదే కానీ కొన్ని సందర్భాలలో కొంత మంది అభిమానుల ప్రవర్తన వల్ల భయం కూడా వేస్తుంది.

అలాంటి సంఘటన నా కెరియర్ లో కూడా ఒకటి జరిగింది అని ఓ విషయాన్ని కాజల్ చెప్పింది. కాజల్ తాజాగా మాట్లాడుతూ ... నేను ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నా వ్యాన్ లోకి వచ్చాడు. చొక్కా విప్పి తన ఛాతిపై టాటూ వేయించుకున్న నా పేరును చూపించాడు. అభిమానానికి ఆనందమే కానీ అతడి ప్రవర్తనకు నాకు చాలా భయం వేసింది. ఇలా ఇంకెప్పుడూ చేయద్దు అని చెప్పి నేను అతన్ని గట్టిగా హెచ్చరించాను అని కాజల్ చెప్పుకొచ్చింది.

ఇకపోతే తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తనకు బాగా నచ్చిన సినిమాలు బ్రహ్మోత్సవం , సీత , సత్యభామ అని చెప్పుకొచ్చింది. దానితో విడుదల కాకముందే ఈమె తన ఫేవరెట్ సినిమాల లిస్టు లో ఈ మూవీ ని జాయిన్ చేసింది అంటే ఈ మూవీ పరవాలేదు అనే స్థాయిలో అయినా కచ్చితంగా ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: