ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న నటీమణులు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అలాగే దానిని ఉంచుకొని కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ ఆ తర్వాత మళ్లీ ఏదాతదిగా తమ కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఆలియా భట్ కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే గర్భవతి అయ్యింది. దాదాపు సంవత్సరం కాలం పాటు సినిమాలకు దూరం ఉంది. ఇక ఒక పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత ఈమె కొంత కాలం పాటు బిడ్డ ఆలనా , పాలన చూసుకొని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిడ్డ యొక్క మంచి చెడులు చూసుకుంటుంది.

ఇక ఆ రూట్ లోక్ కత్రినా కైఫ్ కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం గర్భం దాల్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా లండన్ వీధుల్లో కౌశల్ తన భార్య కత్రినా ను చేయు పట్టుకుని జాగ్రత్తగా తీసుకొని వెళుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో కత్రినా గర్భంతో ఉన్నట్లు కనిపించింది. దానితో కత్రినా ప్రస్తుతం గర్భంతో ఉంది అని , త్వరలోనే ఈమె లండన్ లో డెలివరీ కాబోతుంది అని బిటౌన్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తపై ఈ జంటే అధికారిక ప్రకటన ఇచ్చే వరకు దీనిపై పూర్తి క్లారిటీ రాదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కత్రినా కైఫ్ , సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన టైగర్ 3 అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kk