దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది జాన్వికపూర్. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఎంతోమంది హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని.. వారితో రొమాన్స్ చేసింది. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి టాలీవుడ్ ప్రేక్షకులను హీరోయిన్గా పలకరించేందుకు సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర అనే మూవీలో హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని చెప్పాలి. కాగా ఇక ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా..  ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. కాగా ఇటీవల ఇక దేవర మూవీలో తన పాత్ర ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ హీరోయిన్.


 దేవర సినిమాలో తన పాత్ర తంగం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ వెల్లడించింది. ఈ సినిమాలో నాకు చాన్స్ రావడం అదృష్టం. ఇక్కడి కథలు అద్భుతంగా ఉంటాయి. వీరి దృక్పథం, నేపథ్యం కూడా నాకు నచ్చుతూ ఉంటాయి అంటూ జాన్వి కపూర్ తెలిపింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మూవీతో పాటు అటు రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది జాన్వి కపూర్. ఇలా గ్లోబల్ స్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఇద్దరు హీరోల సినిమాలో ఛాన్సులు కొట్టేసింది. ఇక ఈ సినిమాలు సూపర్ హిట్ అయితే అటు జాన్వి కెరియర్ కు తిరిగి ఉండదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: