బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు వంటి వాటిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.టాలీవుడ్లో బెంగుళూరు రేవ్ పార్టీ గురించే హాట్ టాపిక్గా మారింది. ఈ రేవ్ పార్టీలో ఉన్నారంటూ కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణలు రాగా.రేవ్ పార్టీ వ్యవహారంలో సినీ నటి హేమ చిక్కుకున్నారు. తాను ఆ పార్టీలో లేనని హేమ చెప్పగా.. ఆమె ఉన్నారని బెంగళూరు పోలీసులు వెల్లడించారు.సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సెలబ్రిటీలు ఏదైనా వివాదంలో చిక్కుంటే.. వాళ్ల పుట్టుపూర్వత్తరాల నుంచి వారు ఎవరితో గొడవలు పెట్టుకున్నారు..వారంతా ఒక్కొక్కరిగా తమ తప్పు ఏం లేదని చెప్పడానికి ముందుకొస్తున్నారు. అందరికంటే ముందుగా నటి హేమ... తను ఏ తప్పు చేయలేదు అని చెప్తూ వీడియోను విడుదల చేశారు. కానీ ఈ వీడియోపై ఎక్కువమంది స్పందించలేదు. తన తప్పు లేదంటూ హేమ చెప్పిన మాటలు తప్పు అని సీపీ దయానంద్ ఆరోపించారు. దీంతో ఈ విషయంపై కరాటే కళ్యాణి తన స్టైల్లో స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో హేమపై ఘాటు కామెంట్స్ చేసారు.

‘‘నిన్న బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క... ఇండస్ట్రీ వాళ్ల గురించి చాలా రకాలుగా మాట్లాడారు. ‘అన్నింటికి నేను పెద్ద ముత్తైదువని, అన్నింటికి నేను బాధ్యురాలిని అని, నేనే అందరినీ ఉద్దరిస్తున్నాను అని, ప్రతీదాంట్లో నేనే ఉన్నానని, ఆడవాళ్లకు చాలా సాయం చేస్తున్నానని. ఇండస్ట్రీ వాళ్లు నా మీద ఆధారపడ్డారు. నేనే పెద్ద దిక్కుని. మా అసోసియేషన్ ఎలక్షన్స్లో గానీ ఎక్కడైనా నేను ఉన్నాను’ అన్నట్టుగా ఆమె ప్రవర్తించిన తీరు చూస్తుంటే బయటవాళ్లు నిజంగానే ఈమెది పెద్ద నోరు, మనం మాట్లాడకూడదు అనుకునేవాళ్లు. ఎవ్వరినీ వదలకుండా పిచ్చి పిచ్చిగా ఆమె చేసిన గొడవలు అన్నీ మనం చూశాం’’ అంటూ హేమ చెప్పిన మాటలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు కరాటే కళ్యాణి.అంతే కాకుండా హేమ ఇదివరకు తప్పులను కూడా గుర్తుచేశారు కళ్యాణి. ‘‘మా అసోసియేషన్లో శివ బాలాజీ చేయి కొరికింది. అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ను అడ్డగించింది. తన మీద కేసులు పెట్టారని పోలీస్ స్టేషన్స్కు వెళ్లింది. నేను ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటుంటే.. అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా మాట్లాడిన హేమక్క.. ఈరోజు నువ్వేం చేశావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు. శాంపిల్స్ బయటికొచ్చిన తర్వాత బెంగుళూరు పోలీసులు కచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు’’ అంటూ ఇన్ డైరెక్ట్గా హేమకు వార్నింగ్ కూడా ఇచ్చారు కరాటే కళ్యాణి.‘‘ఒక మనిషి ఒక మాట అనేముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగొస్తుంది అని. కాబట్టి ఇకముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, శాంపిల్స్లో ఏ తప్పు లేకుండా ఉండాలని నేను మరొక్కసారి కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొక్కసారి ఎవరి మీద నోరుపారేసుకోకుండా ఆడవాళ్లను అలా ఇలా అనకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. హేమక్క ఇప్పటికైనా అర్థమయ్యిందా?’’ అంటూ తన వీడియోను ముగించారు కరాటే కళ్యాణి. ప్రస్తుతం బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొనడంపై కళ్యాణి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: