ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో అటు విజయ్ దేవరకొండ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. చిన్న చితకా పాత్రలు వేస్తూ కెరియర్ ను ప్రారంభించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఏకంగా పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. ఓవర్ నైట్ లోనే స్టార్ డం సంపాదించేసాడు అని చెప్పాలి. ఇక గీత గోవిందం సినిమాతో 100 కోట్ల హిట్టు కొట్టి స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ.


 తన సినిమాలతోనే కాదు తన యాటిట్యూడ్ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి కోట్లాదిమంది ప్రేక్షకులకు గుండెల్లో నిలిచిపోయాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ విజయ్ దేవరకొండని రౌడీ హీరో అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి  రౌడీ హీరో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా పలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు ఆనంద్ దేవరకొండ.


 ఈ క్రమంలోనే తమ్ముడు ఆనంద్ కోసం అన్న విజయ్ ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన సోదరుడు ఆనంద్ ఈ తన గొంతు కూడా ఒకేలా ఉంటుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా ఆట పట్టించేవాళ్ళం అంటూ తెలిపాడు. ఇంట్లో మా అమ్మను పిలిచినప్పుడు.. ఎవరు పిలుస్తున్నారో ఆమె గుర్తుపట్టేది కాదు. అలా మా ఇద్దరి వాయిస్ ఒకేలా ఉంటుంది అన్న విషయం మాకు అర్థమైంది అంటూ విజయ్ దేవరకొండ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: