స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.నయనతార ప్రస్తుతం బడా హీరోల లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో లు చేస్తూ అలరిస్తుంది నయన్.ఇటీవలే హిందీలో జవాన్ తో భారీ హిట్ అందుకుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ భారీ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక నయనతార వ్యక్తిగత విషయానికొస్తే..ఇక నయనతార చిత్ర పరిశ్రమకు చెందిన వార్తలకంటే ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్తల ద్వారానే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. లవ్ ఎఫైర్ నుంచి మొదలు పెడితో సరోగసి ఇష్యూ వరకు ప్రతి దాంట్లో ఈ బ్యూటీని జనాలు ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నటికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నయన్ తన పిల్లలతో కలిసి ఓ ఆటోలో ప్రయాణించింది. నయన్ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో నయన్ ఈ మధ్య బాగానే యాక్టివ్ గా ఉంటుంది పిల్లలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా నయన్ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లను చెన్నైలో ఆటో రిక్షా రైడ్‌కు తీసుకెళ్లారు.ఆమె ఈ మేరకు మే 20న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. రోజూ లగ్జరీ కార్లలో తిరిగే నయనతార తనకు వీలైనప్పుడల్లా పిల్లల్ని ఆటో ఎక్కించడం ఆచారంగా మారింది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. కోలీవుడ్లో టాప్ నటి అయినప్పటికీ, తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే నయనతార, వారితో సరదాగా ఆటోలో ప్రయాణించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఒకప్పుసు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చినా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన తర్వాత, నయనతార తన కొడుకులతో చాలా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న వీడియోలో , ఇద్దరు పిల్లలను వారి ఒడిలో కూర్చోబెట్టడాన్ని మనం చూడవచ్చు, విఘ్నేష్ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార చివరిసారిగా వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి’లో కనిపించింది, భారీ ట్రోలింగ్స్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నుండి తీసి వేయబడింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క రెండు తమిళ సినిమాలు ‘టెస్ట్’, ‘1960 నుండి మన్నంగట్టి’ షూటింగ్ ముగించింది. ఇటీవల, ఆమె తన మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ షూటింగ్ ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: