ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు 'పుష్ప 2: ది రూల్'లో ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ నచ్చింది.కామన్ ఆడియన్స్ నుంచి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఆ పాటలో శ్రీవల్లి లేదు. అదేనండీ... హీరోయిన్ రష్మికా మందన్న లేరు. ఆవిడ అభిమానుల కోసం రెండో పాటను విడుదల చేస్తున్నారు.పుష్ప' సినిమాలో 'సామి సామి' పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక కోసం ఆ పాటను మళ్ళీ మళ్ళీ చూసిన జనాలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్ 'పుష్ప 2'లో కూడా రష్మిక మీద ప్రత్యేకంగా సాంగ్ డిజైన్ చేశారు. ఆ సాంగ్ ఎప్పుడు విడుదల చేసేది గురువారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది.ఒక్క సినిమాతో ప్రపంచ సినీ ప్రియుల్ని సైతం తన వైపుకు తిప్పుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప' మూవీతో తన క్రేజ్ దేశం నుంచి ప్రపంచానికి చేరింది.ఎలాంటి పాన్ ఇండియాగా తెరకెక్కకపోయినా.. సినిమా రెస్పాన్స్‌తో వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ మూవీలో బన్నీ స్టైల్, స్వాగ్, మాస్ అవతార్‌కి యావత్ సినీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

దర్శకుడు సుకుమార్ తన క్రియేటివిటీతో బన్నీని ఓ రేంజ్‌లో చూపించి అదరగొట్టేశాడు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌ను కూడా ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'పుష్ప 2'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా మేకర్స్ కూడా ఈ మూవీకి సంబంధించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ సినీ ప్రియుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు.ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి 'జాతర' యాక్షన్ సీన్లను రిలీజ్ చేశారు. అందులో బన్నీ.. మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఆ గ్లింప్స్ యమ స్పీడ్‌లో రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో అప్డేట్‌తో వచ్చి అట్రాక్ట్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా అందులో బన్నీ వేసే క్లాసిక్ స్టెప్పులు కూడా ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఆ అప్డేట్ ఏంటా అని.

మరింత సమాచారం తెలుసుకోండి: