మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను కూడా చేరుకున్నాడు.అప్పటి నుంచి వెనుదిరిగి చూడని పవర్ స్టార్.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు పవన్ కోసం త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆ వివరాలను మీరే చూడండి
'వకీల్ సాబ్' మూవీతో గ్రాండ్ రీఎంట్రీని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దీని తర్వాత 'భీమ్లా నాయక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అదిరిపోయే స్పందన లభించడంతో వసూళ్లు భారీగానే వచ్చాయి. దీని తర్వాత పవన్ కల్యాణ్ 'బ్రో' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది మాత్రం అతడికి నిరాశనే మిగిల్చిందన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనూ 'ఉస్తా భగత్ సింగ్', సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' అనే సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొకటి చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతడితో పాటు ఆ పార్టీ తరపున చాలా మంది బరిలో నిలిచారు. దీంతో పవన్ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ, త్వరలోనే అతడు ఓజీ షూట్‌లో పాల్గొంటున్నాడు.టాలీవుడ్ బడా హీరో పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వీటిని వీలు చిక్కినప్పుడల్లా చేసుకుంటూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఇప్పట్లో కొత్త సినిమాలను ప్రకటించడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కల్యాణ్ కోసం రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు తాజాగా తెలిసింది.పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సీరియస్‌గా వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టగా.. అందులో ఒక దానిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతుందట. మరో దానికి కూడా అన్నీ సెట్ చేసే విధంగా గురూజీ వర్క్ చేస్తున్నారని టాక్. మరి ఈ రెండు చిత్రాలను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: