టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న బ్యూటీ లలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని కమర్షియల్ సినిమాలలో నటించినప్పటికీ ఈమె ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది. అందుకు ప్రధాన కారణం ఈమె కెరియర్ ప్రారంభంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే అందులోని ఈమె నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంశలు దక్కడంతో ఒక్క సారిగా ఈ మూవీ తో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో కీర్తి కి కూడా వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. ఇక ఈమె ఇప్పటి వరకు అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. కానీ ఏ మూవీ కూడా మహానటి స్థాయి విజయాన్ని ఈమెకు అందించలేదు.

ఇకపోతే ఈమె మరోసారి ఒక అద్భుతమైన గుర్తింపు పొందిన మహిళ జీవిత కథ ఆధారంగా రూపొందబోయే సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ సింగర్ దివంగత ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించాలి అని కొంత మంది మేకర్స్ అనుకుంటున్నట్లు , అందులో భాగంగా కీర్తి సురేష్ ను ఇందులో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రకు తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు అన్ని కుదిరితే సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే తమిళనాడు లోని మధ్య తరగతి కుటుంబం లో జన్మించిన సుబ్బలక్ష్మి గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు , ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు , జీవితంలో విషాద సంఘటనలను ఈ చిత్రం లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks