టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తను వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.RRR తర్వాత పాన్ ఇండియన్ కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్.ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఉందా ఆగిపోయిందా..? అదేంటి బాబోయ్ అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా..? మరి ఏడాది నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే అనుమానాలు రావా మరి..? ఇదే అనుమానం టీంకు కూడా వచ్చినట్లుంది.అందుకే ఎన్టీఆర్ బర్త్ డే అప్‌డేట్ అంటూ ఓ తీపికబురు చెప్పారు. అందులోనే అసలు విషయం దాచేసారు. మరి అదేంటో చూద్దామా..? rrr తర్వాత పాన్ ఇండియన్ కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. అందుకే టెక్నికల్‌గా సౌండింగ్ ఉన్న లకే ఓటేస్తున్నారు తారక్.
ఈ క్రమంలోనే దేవర కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఆ తర్వాత అయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ లైన్‌లో ఉన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. ప్రశాంత్ నీల్ పై కొన్నాళ్ళుగా ఏ సౌండ్ లేదు. సలార్ 2తో త్వరలోనే బిజీ కానున్నారు ప్రశాంత్ నీల్.మరోవైపు తారక్ కూడా దేవర పార్ట్ 1తో పాటు వార్ 2 చేస్తున్నారు. నెల రోజులుగా వార్ 2తోనే బిజీగా ఉన్నారు తారక్. ప్రస్తుతం టర్కీలో ఉన్న ఎన్టీఆర్.. వచ్చాక దేవర 1ను పూర్తి చేయనున్నారు.. అలాగే వార్ 2 కూడా కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత దేవర 2 మొదలు కానుంది.
ఇవన్నీ అయ్యేలోపు సలార్ 2 పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలవుతుందని తెలిపారు నిర్మాతలు. వార్ 2, దేవర 2 పూర్తి చేసే సమయానికి.. సలార్ 2 పూర్తి చేయడంతో పాటు ntr 31 స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్. ఒకవేళ ఆగస్ట్ నుంచి షూట్ మొదలైనా.. తారక్ జాయిన్ అవ్వడానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది. మొత్తానికి చూడాలిక.. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: