కొంత కాలం పాటు వరుస అపజయాలను ఎదుర్కొన్న శర్వానంద్ "ఒకే ఒక జీవితం" మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. ఇక ఒకే ఒక జీవితం సినిమాతో విజయాన్ని అందుకున్న శర్వా ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తూ వెళుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం మనమే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం శర్వానంద్ , రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాతో పాటు అభిలాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇలా మనమే సినిమాతో పాటు ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా శర్వా మరో మూవీ ని కూడా ఓకే చేసే పని లో ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సంపత్ నంది తాజాగా శర్వానంద్ కు ఓ కథను వినిపించినట్లు , ఆల్మోస్ట్ ఈ కథ శర్వా కు నచ్చినప్పటికీ కొన్ని మార్పులు , చేర్పులను సూచించినట్లు తెలుస్తోంది. దానితో ఆ మార్పులను , చేర్పులను చేసి శర్వా కు మరోసారి కథను వినిపించనున్నట్లు , కథ కనుక శర్వా కి నచ్చినట్లు అయితే వీరి కాంబో లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది ఆఖరుగా గోపీచంద్ హీరో గా రూపొందిన సిటీమార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి మూవీ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. మరి ఈయన శర్వా తో సినిమా ఓకే చేసుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: