టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మూవీ బృందం వారు ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో 76 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ సినిమా యొక్క చిత్రీకరణను వెంకీ 76 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం వారు తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ ఉండబోతున్నట్లు ఆ పాత్ర కోసం అనేక మంది ని మూవీ బృందం వారు వెతుకుతున్నట్లు ఒక వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం ఒకే హీరోయిన్ ఉండబోతున్నట్లు , రెండవ హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబో లో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే మూవీ లు రూపొందాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరో గా నటించాడు.

మూవీ మాత్రం సోలో హీరో గా రూపొందుతుంది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయ్యని అందుకుంటుందో చూడాలి.  విక్టరీ వెంకటేష్ ఆఖరిగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అపజయాన్ని అందుకోగా , అనిల్ రావిపూడి ఆఖరుగా బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: