కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ యశ్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే కేజీఎఫ్ సినిమా తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న యశ్ ఇప్పుడు గీతు మోహన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ

 చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ భామ ను మరో పాత్ర కోసం  ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి .అయితే ఇప్పుడు ఇందులో బాలీవుడ్ బ్యూటీ హుమ ఖురేషి  నటించబోతోంది. అన్న వార్తలు వినబడుతున్నాయి ఇకపోతే ఇందులో సిస్టర్ పాత్ర సైతం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆ పాత్ర కోసం నయనతార ను ముందుగా అనుకున్నారట. కానీ ఈ పాత్ర నయనతార ముందు

 రిజెక్ట్ చేసింది. కానీ హీరో పాత్రకి ఈక్వల్ గా సిస్టర్ పాత్ర కూడా ఉంటుంది అందుకే ఈ పాత్రకి నయనతార అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనుకున్నారట. కానీ నయనతార మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. దాంతో నయనతార ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర కోసం ఇప్పుడు హుమా ఖురేషి ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు ఇందులో సిస్టర్ పాత్ర చేయడం కోసం ఈ బ్యూటీ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈమె హిందీలో నే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తుండడం.తో నయనతార తర్వాత ఈ పాత్ర తనకి అయితేనే బాగుంటుంది అని అంటున్నారు మేకర్స్. ఇక కే జి ఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యశ్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: