బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది వైష్ణవి చైతన్య. దేనికంటే ముందు పలు వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు లవ్ మీ అనే సినిమా చేస్తోంది. టాలెంటెడ్ హీరో ఆశిష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హర్షిత్

 రెడ్డి హన్షిత నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హారర్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా మే 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేస్తున్నారు చిత్రబృందం.  తాజాగా హీరో ఆశిష్ సినిమాపై పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. సినిమాలో దయ్యం ఎవరు అన్న విషయాన్ని

 వెల్లడించాడు. అయితే "చంద్రముఖి ముని వంటి సినిమాలు ఇప్పటికీ చాలా చూశాను అని ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక సమస్య ఉంటుందని.. కానీ నాది మాత్రం ఆ సమస్యలకు పరిష్కారాన్ని వెతికి పాత్ర అని.. ఇందులో హారర్ అనేది ఒక భాగం మాత్రమే హారర్ తోపాటు ఇందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది అని చెప్పాడు. అంతేకాదు ఇది రివేంజ్ స్టోరీ కాదు అని అసలు ఇందులో వైష్ణవి దయ్యం కాదు అని.. సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని సినిమాలో ఊహించని సర్ప్రైజ్ లో చాలా ఉన్నాయి అని... అంతేకాదు ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఒక కొత్త సినిమా చూశాము అన్న ఫీలింగ్ తో బయటికి వస్తారు అని చెప్పాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: