క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సత్యభామ'. కాజల్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలతో జతకట్టి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్‌లతో కుర్రకారును ఊర్రూతలూగించింది.అయితే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును మ్యారేజ్ చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కుటుంబం, పిల్లలతో లైఫ్‌ను లీడ్ చేసింది. అయితే అంతా చక్కబడ్డాక ఇప్పుడు మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతేడాది బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో హీరోయిన్‌గా నటించింది.

మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే కాజల్ పలు సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. అయితే ఆమె నటిస్తున్న చిత్రాల్లో లేడీ ఓరియేంటెడ్ మూవీ ఒకటుంది. అదే 'సత్యభామ'. ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఎప్పుడెప్పుడు వెల్లడిస్తారా అంటూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా జూన్ 7న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, హర్షవర్థన్, ప్రకాష్ రాజ్, నాగినీడు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మే 24న సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో నందమూరి బాలకృష్ణ గర్జన చూసేందుకు రెడీగా ఉండండి అంటూ రాసుకొచ్చింది.గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి స్క్రీన్‍ప్లే అందించాడు. సత్యభామ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: