టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరో రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే దిల్ రాజు తన ప్రొడక్షన్ నుండి వచ్చిన సినిమాల ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తారు. అంతేకాదు ఆయన సినిమా వస్తుంది అంటే చాలు హంగామా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇకపోతే ఈ శనివారం మే 25న లవ్ మీ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అన్నీ సినిమాల ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేసిన దిల్ రాజు ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త

 సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పాలి. ఇటీవల ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ సమయంలో దిల్ రాజు కాన్ఫిడెన్స్ ధైర్యం మాటలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. కానీ ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఊహించిన విధంగా ఫ్లాప్ అయ్యింది. ఇందులో భాగంగానే ఇప్పుడు దిల్ రాజు సినిమా కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ సక్సెస్ అయిన తర్వాతే మాట్లాడాలి అని నిర్ణయించుకున్నట్లు గా  సమాచారం వినబడుతోంది. లవ్ మీ సినిమా నిర్మించింది తన కూతురు. అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ అన్నిటిని దిల్ రాజు దగ్గరుండి

 చూసుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో మాట్లాడుతూ ఈ సినిమా థియేటర్స్ లో విడుదలయితే మూతబద్ధ థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు అంటూ ఊహించని విధంగా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా రిసల్ట్ కోసం అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు తీరు గమనిస్తే గతంలో ఇదే విధంగా బలగం సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఎందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అప్పట్లో విడుదలైన బలగం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా చాలా అవార్డు లు సైతం అందుకుంది బలగం. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: