తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన బాలయ్య.. ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా బాలయ్య కుమారుడు ఎంట్రీ పైన పలు రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన గతంలో బాలయ్య మాట్లాడినప్పటికీ ఇప్పటి వరకు ప్రకటన పైన ఎలాంటి విషయాలను తెలియజేయలేదు.దీంతో అభిమానుల సైతం నిరాశ చెందుతున్నారు.. ఈ ఏడాదిలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం కథ ఎంచుకునే పనిలో పడ్డట్టుగా బాలయ్య తెలుస్తోంది.. ముఖ్యంగా తన కుమారుడికి సరిపోయేటువంటి స్టోరీలైన్ అవ్వగానే కచ్చితంగా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా బాలయ్య భావిస్తున్నారట. దీంతో ఈ విషయం బయటకు రావడంతో మోక్షజ్ఞ సినిమాడైరెక్టర్ తో ఉంటుంది ఏ హీరోయిన్ తో చేస్తారనే విషయం పైన అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే మొదలుపెట్టేశారు. కచ్చితంగా బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే ఫస్ట్ సినిమాను ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసి ఉంటారనే విధంగా అభిమానులు భావిస్తున్నారు.


కానీ గతంలో బాలయ్య తను నటించిన ఆదిత్య -369  సినిమాని సీక్వెల్ గా చేస్తే అది తన కుమారుడి తోనే చేస్తానని కచ్చితంగా తన డైరెక్షన్లోనే చేస్తాననే విధంగా బాలయ్య గతంలో తెలియజేశారు. అయితే గత కొన్నేళ్లుగా బాలయ్య కుమారుడు కాస్త లావుగా ఉండడంతో ఇటీవలే చాలా స్లిమ్ గా తయారవ్వడంతో కచ్చితంగా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి అభిమానుల కోరిక మేరకు ఈ ఏడాది బాలయ్య కుమారుడు ఎంట్రీ ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతం బాలయ్య సినిమాల విషయానికే వస్తే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో nbk-109  చిత్రంలో నటిస్తూ ఉన్నారు. వరుసహిట్ లతో దూసుకుపోతున్న బాలయ్య సరికొత్త కదా అంశాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: