నటి అధితి రావు హైదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తలతో వైరల్ అయ్యే ఈమె ఇప్పుడు మరొక వార్తతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.  అదేంటంటే ఎంతో అదృష్టం ఉంటే గాని నేను కొన్ని పాత్రలు చేయలేను అంటూ అంటుంది. సంజయ్ లీలా బన్సాలితో ఆమెకి ఉన్న పరిచయమే తన అదృష్టం అని అంటుంది. ఇక ఇటీవల హీరమండీ చూసిన అందరూ కూడా తనకి ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు అంటూ.. ఇది చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. అయితే

 తన కెరీర్లో బిజోజాన్ క్యారెక్టర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది అని తన సంతోషాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు సంజయ్ లీలా భన్సాలీ తో సెట్ లో అడుగుపెట్టిన మొదటి క్షణం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. పద్మావత్ సెట్లో అడుగుపెట్టినప్పుడు అసలు నేను ఏ లోకంలో ఉన్నానో అంటూ ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకువచ్చింది. అక్కడ జరిగిన ప్రతి ఒక్క క్షణం నేను మర్చిపోలేను అంటూ చెప్పింది. అదే సమయంలో రణవీర్ తనను తట్టి ఆదు

 నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్ళావా ఏంటి అని గట్టిగా అరిచాడు అంటూ చెప్పింది. ఇక ఆ అనుభూతిని నేను ఎప్పటికీ మాటల్లో చెప్పలేను అంటూ వెల్లడించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇటీవల సిద్ధార్థ తో నిశ్చితార్థం చేసుకుంది అదితి. పెళ్లి ఎప్పుడు అని ఈ సందర్భంగా చాలా మంది అడుగుతున్నారు. ఇక ఈ విషయాన్ని గురించి ఎక్కడా కూడా నోరు తెరవడం లేదు ఈ ముద్దుగుమ్మ. అన్ని విషయాలు అందరితో ఎందుకు చెప్పాలి అని వ్యక్తిగత విషయాలు ఉంటాయి వాటిని అందరూ గౌరవించాలి.. అంటూ ఈ సందర్భంగా తెలిపింది. దీంతో ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అయితే మొత్తానికి తన పెళ్లి గురించి నోరు విప్పని ఈ ముద్దుగుమ్మ ఆ డైరెక్టర్ పై కామెంట్స్ చేయడంతో ఇప్పుడు అందరూ షాక్ కి గురవుతున్నారు. మరి ఇప్పటికైనా అదితి పెళ్లిపై నోరు విప్పుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: