టాలీవుడ్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకు హీరోయిన్ పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది కాజల్. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా సత్యభామ సినిమా జూన్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ కి

 సంబంధించిన పనులతో బిజీగా ఉంది కాజల్. అయితే గత కొద్దిరోజులుగా కాజల్ ఒక స్టార్ హీరో దర్శకత్వంలో సినిమా చేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి.  ఇక ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ఇదే విషయంపై సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చింది కాజల్. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.." ప్రశాంత్ వర్మ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని.. హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అని..

 మా కాంబినేషన్ గురించి ఇప్పటివరకు చాలా రకాల చర్చలు జరిగాయి అని.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు హోల్డ్ లో ఉంది అని క్లారిటీ ఇచ్చింది." దీంతో ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సడన్గా ఈ వార్త విన్న కాజల్ అభిమానులు కాజల్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఏంటి అని షాక్ అవుతున్నారు. ఇక మరికొందరు నిజంగా వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే గనుక కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని వాళ్ళ అభిప్రాయాలని వ్యక్త పరుస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హనుమాన్  తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రన్వీర్ సింగ్ తో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కాజల్ తో సినిమా కి సిద్ధంగా ఉన్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: