నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం ప్రస్తుతం ఎటువంటి రోల్స్ అయినా సరే నటించగల సత్తా ఉన్న రష్మిక మందన స్టార్ డైరెక్టర్స్ తమ సినిమా కోసం అడుగుతే మాత్రం ఖచ్చితంగా కాదు అని చెప్పదు. అయితే ప్రస్తుతం ఒక విషయంలో రష్మిక మందన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది. అదేంటంటే ముఖ్యంగా రష్మిక మందన ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్

 విజయాలను అందుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రష్మిక మందన ను తమ సినిమాలో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఇప్పుడు క్యూ కడుతున్నారు అని చెప్పాలి. అయితే రష్మిక మందన ఇప్పటికే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.  తాజాగా ఇప్పుడు ఆ లిస్టులోకి మరొక స్టార్ హీరో కూడా చేరబోతున్నాడు. ఆ స్టార్ హీరో మరెవరు కాదు జూనియర్ ఎన్టీఆర్.  జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీలు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన

 అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ సినిమా కి డ్రాగన్ అన్న టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు ఫిక్స్ చేసినట్లుగా చిత్ర బృందం అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇకపోతే ఈ సినిమా ఆగస్ట్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా రష్మిక మందన మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ తో నటించబోతోంది. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: