బిగ్బాస్ ఫేమ్ శోభా శెట్టి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.గృహ ప్రవేశం ఎప్పుడో చేసినా.. తన యూ ట్యూబ్ ఛానల్ కోసం దానిని గాసిప్గా ఉంచింది. తన యూట్యూబ్ ఛానల్ గృహ ప్రవేశం వీడియోని షేర్ చేసింది.యూట్యూబ్లోనే కాకుండా ఇన్స్టాలో కూడా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.డ్రీమ్ కమ్ ట్రూ, న్యూ హోం, న్యూ లైఫ్,న్యూబిగినింగ్, గ్రేట్ ఫుల్ ఫర్ ఎవ్రిథింగ్ అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.అయితే ఇదిలా ఉండగా.. ఫోటోలు కింద నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెప్తే.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.పెళ్లికాకుండా ఇలా ప్రియుడితో కలిసి గృహ పూజ చేయడమేంటి అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే యశ్వంత్ ఇప్పటికే శోభా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు.కార్తీక దీపం షూటింగ్ సమయంలో శోభా, యశ్వంత్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వారు తమ విషయాన్ని సీక్రెట్గా ఉంచారు.శోభాశెట్టి బిగ్బాస్లో ఉన్నప్పుడు యశ్వంత్ తన బాయ్ ఫ్రెండ్ అంటూ అసలు మ్యాటర్ బయటకు తెచ్చింది శోభా. రీసెంట్గానే అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. త్వరలో ఈ జంట పెళ్లి పీఠలెక్కబోతున్నారు.పెళ్లి కాకుండానే ప్రియుడితో గృహ పూజ చేసిన బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు .ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పుడెప్పుడు శోభా ఫోటోలు షేర్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చీరకట్టు ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ వయ్యారి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గృహ పూజకు సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. సోషల్ మీడియాలోనే కాకుండా యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ తన ప్రియుడినీ ఆటపట్టిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వుంటుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్, అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: