టాలీవుడ్ బ్యూటీ కాజల్ ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ ఏసిపి ఆఫీసర్గా కాజల్ కనిపించనుంది.సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడది జూన్ 7న సత్యభామ ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది కాజల్ అగర్వాల్.ప్రశాంత్ నీల్ హనుమాన్ తో తన సత్తాచాటుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్. కొత్త కొత్త ప్రాజెక్టు లతో అందరినీ ఆకర్షిస్తూ ఆకట్టుకుంటున్నారు.అయితే కాజల్.. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతుందంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కాలేదు. తాజాగా దీనిపై సత్యభామ ప్రమోషన్స్ లో స్పందించింది కాజల్. ఆమె మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానని.. హనుమాన్ తో భారీ సక్సెస్ అందుకున్నాడంటూ వివరించింది. మా కాంబినేషన్ గురించి ఇప్పటికి ఎన్నో చర్చలు జరిగాయని అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హోల్డ్ లో ఉందంటూ వివరించింది.కాగా ప్రస్తుతం కాజల్ చేసిన కామెంట్స్ నెట్ వైరల్ అవడంతో.. ప్రశాంత వర్మ, కాజల్ కాంబోలో సినిమా అనుకున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరు కాంబోలో సినిమా వస్తే నిజంగానే బాగుంటుంది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌తో పాటు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి మరో సినిమాలో సటించనున్నాడు. దీంతో కాజల్‌, ప్రశాంత్ వర్మ సినిమా వీటి తర్వాత సెట్స్ పైకి వస్తందనే అంచనాలు వేస్తున్నారు నెటిజన్స్‌.ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హనుమాన్ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రన్వీర్ సింగ్ తో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కాజల్ తో సినిమా కి సిద్ధంగా ఉన్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: