ఈ మధ్యకాలంలో ఏంటో కానీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండు కొనసాగుతుంది. ఒకప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు సినిమాల్లో ఉంటే ఇక మూవీస్ సూపర్ హిట్ అయ్యేవి. ఇక రికార్డులు కూడా సృష్టించేవి. 100 రోజుల రికార్డును కొట్టేవి కూడా ఇలాంటి పెద్ద సినిమాలే ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీంతోఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రేక్షకుల పంతా పూర్తిగా మారిపోయింది. ఒకప్పటిలా ఇక సినిమాలో స్టార్ హీరోలు ఉండాలని.. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ ఉండాలని కోరుకోవట్లేదు. కథ బలంగా ఉండాలని కథలో కొత్తదనం ఉండాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


 ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలలో స్టార్ హీరోలు నటించకపోయిన సరే.. ఇక బ్లాక్ బస్టర్ ను ఇచ్చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. దీంతో గత కొంతకాలం నుంచి ఇలా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు సాధిస్తూ వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ ఉండడం..  ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో మూవీ ఇలాగే బ్లాక్ బస్టర్ సాధించింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో ఒక చిన్న సినిమా 900 కోట్ల వసూళ్లు సాధించింది. ఒక బ్లాక్ బస్టర్ మూవీని దాటేసింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.


 900 కోట్ల వసూళ్లు సాధించింది ఈ మూవీ. బ్లాక్ బస్టర్ హీట్ అయిన ఈ మూవీ ఓటీటిలో కూడా సత్తా చాటింది. అయితే ఇక ఈ సినిమాను ఓటిటిలో వెనక్కి నెట్టేసింది నాలుగు కోట్ల బడ్జెట్ మూవీ  తక్కువ బడ్జెట్ తో తెరకేక్కిన చిన్న సినిమా లాపత లేడీస్ సూపర్ హిట్ అయింది   అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో దుమ్మురేపుతుంది. ఇక ఈ ఏడాది జనవరి 26న వచ్చిన యానిమల్ కు ఇప్పటివరకు 13.6 మిలియన్ వ్యూస్ రాగా.  నెల రోజుల క్రితమే వచ్చిన లాపత లేడీస్ కి 13.8 మిలియన్ న్యూస్ వచ్చాయి. ఇలా తక్కువ సమయంలోనే రికార్డు బ్రేక్ చేసింది ఈ చిన్న మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: