దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలతో అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈయనకు దేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు వచ్చింది. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం కమల్ హాసన్ హీరోగా "ఇండియన్ 2" అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఈ మూవీ ఆగిపోవడం , చాలా కాలం స్టార్ట్ కాకపోవడంతో చరణ్ హీరో గా శంకర్మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా మొదలు అయ్యి కొంత భాగం పూర్తి కాగానే మళ్లీ "ఇండియన్ 2" మూవీ ని కూడా తిరిగి ప్రారంభించాడు. దానితో ఈ రెండు సినిమాలను ఒకే కాలంలో పూర్తి చేస్తూ వచ్చాడు. ఇక కొన్ని రోజుల క్రితమే "ఇండియన్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాను జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కొంత భాగం బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ నుండి మొదటి పాటను కొన్ని రోజుల క్రితమే విడుదల చేయగా , "ఇండియన్ 2" లోని మొదటి పాటను రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. ఇక ఈ రెండు సాంగ్ ల  ఔట్  పూట్ ను పరిశీలించినట్లు అయితే గేమ్ చేంజర్ కంటే కూడా "ఇండియన్ 2" దే కాస్త బెటర్ గా ఉన్నట్లు జనాలు ఫెయిల్ అవుతున్నారు. ఒక సాంగ్ వరకు అయితే ఓకే కానీ సినిమా అంతా కూడా అలాగే ఉంటుందా అనే చరణ్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరి అవుట్ పుట్ విషయంలో "ఇండియన్ 2" ను  గేమ్ చేంజర్ బీట్ చేస్తుందా... లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: