ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే దానికి సీక్వెల్ ను రూపొందించడం చాలా కామన్ గా మారిపోయింది. ఇక సినిమా విడుదల అయ్యి సక్సెస్ అయిన తర్వాత సీక్వెల్ ను ప్రకటించడం కంటే కూడా మరి కొంత మంది సినిమా చివరలో ఆ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఒక వేళ సినిమా సక్సెస్ అయినట్లు అయితే దానికి కొనసాగింపుగా మరో సినిమాను రూపొందిస్తున్నారు.

ఒక వేళ సినిమా కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే దానిని అక్కడే వదిలేస్తున్నారు. ఇకపోతే సినిమా విడుదల కాకముందే మరో మూవీ కి కూడా సీక్వెల్ ఉన్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమా కాదు లవ్ మీ. ఆశిష్ రెడ్డి హీరోగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని రేపు అనగా 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అరుణ్ భీమవరపు ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మూవీ కి సీక్వెల్ ఉండబోతున్నట్లు ముందే ప్రకటించడంతో ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ కు టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ సీక్వెల్ కి కిల్‌ మి ఇఫ్‌ యు లవ్‌ అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని హర్షిత్ రెడ్డి , హన్షిత మరియు నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించగా ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: