అలనాటి తార జయసుధ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. గత కొంతకాలం నుంచి జయసుధ ఎటువంటి సినిమాల్లో కనిపించడం లేదు. కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంది.  మొదట హీరోయిన్గా తన కెరీర్ను ప్రారంభించిన జయసుధ అనంతరం తల్లి పాత్ర లో కూడా నటించింది.

ఇక హీరోయిన్గా ఈమె ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో అంతకి రెట్టింపు తల్లి పాత్రలో గుర్తింపును పొందింది. ఇక ప్రజెంట్ ఎటువంటి పాత్రలోనూ నటించడం లేదు. దీనికి కారణం ఈమెకి సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడమే. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈమెకి ఒక్కసారిగా ఇంట్రెస్ట్ ఎందుకు పోయింది అనే సందేహలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. తాజాగా దీనిపై జయసుధ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ మాట్లాడుతూ.." ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒకటే గ్లామర్ ని మెయింటైన్ చేయాలి అని అంటూ ఉంటారు. గ్లామర్ అండ్ క్యారెక్టర్స్ కూడా అలానే మెయింటైన్ చేయాలి అని చెబుతారు. ఇది కరెక్ట్ కాదు అమ్మాయి. నువ్వు వెళ్లే దారి కరెక్ట్ కాదు.. అని నాకు ఎంతోమంది చెప్పారు. కానీ నాకు నచ్చింది నేను చేయాలి. నాకు నచ్చకపోతే నేను చేస్తే నాకు అసలు నచ్చదు. అసలు సినిమాలే 3 ఇయర్స్ తరువాత నచ్చలేదు.‌ మానేయాలి అని అనుకున్నాను.

ఎందుకంటే ఎప్పుడు చూసినా సినిమా షూటింగ్ అండ్ మేకప్ లోనే ఉండాల్సి వచ్చింది. ఒక ఆర్టిఫిషల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు అనిపించింది. నా లైఫ్ నీ ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఇండిపెండెంట్గా బీచ్ లకి కట్టా తిరగడానికి కూడా కుదరలేదు. రోజంతా ఖాళీ లేకుండా సినిమాల్లో నటించేదాన్ని. ఒక్కో రోజు నైట్ టూ కూడా అయ్యేది. అలా నాకు ఇంట్రెస్ట్ పోయి సినిమాలకి దూరమయ్యాను " అంటూ చెప్పుకొచ్చింది జయసుధ. ప్రజెంట్ జయసుధ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: