తెలుగు సినీ పరిశ్రమలో కమీడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్ష చీముడు తాజాగా సుందరం మాస్టర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో దివ్య శ్రీపాద ఓ కీలకమైన పాత్రలో నటించింది. కమీడియన్ గా మంచి గుర్తింపు కలిగిన హర్ష మొట్ట మొదటి సారి హీరో గా నటించిన మూవీ కావడం , ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేకపోయింది. దాని తర్వాత ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఓ టి టి లో మాత్రం ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇలా థియేటర్ మరియు ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో భారీగా సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది.

మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 1.32 టి ఆర్ పి ను రేటింగ్ తెచ్చుకుంది. ఈ సినిమాకు థియేటర్ , ఓ టి టి లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో దాదాపుగా బుల్లి తెరపై కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేయకపోయినప్పటికీ నటుడిగా హర్ష కు మాత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hc