రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి అనే పాన్ వరల్డ్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. 

మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను ఇప్పటికే మొదలు పెట్టారు. ఇక ఈ మూవీ కి సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను కూడా మేకర్స్ అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా హక్కులను కూడా ఈ మూవీ బృందం అమ్మివేసింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ , ఏ ఏ క్రియేషన్స్ సంస్థ వారు దక్కించుకున్నారు.

ఈ సంస్థల వారు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇకపోతే అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్ ఈ సినిమాలో హీరో గా నటిస్తూ ఉండడం , మహానటి లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని నాగ్ అశ్విన్ రూపొందించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: