యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

మూవీ తో పాటు ఎన్టీఆర్ "వార్ 2" అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ.తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఆగస్టు నుండి ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో మూవీ షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడి గా హీరోయిన్ ని వెతికే పని లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఆ విషయామై మేకర్స్ ఈమెను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే ఎన్టీఆర్ సరసన మొదటి సారి రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: