జయం రవి హీరోగా నయనతార హీరోయిన్ గా మోహన్ రాజా దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం తని ఓరివన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ భాషలో రూపొందిన ఈ సినిమా తమిళ్ లో మాత్రమే విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో అరవింద స్వామి విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కంటే ముందు చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న అరవింద స్వామి ఈ సినిమాతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

మూవీ కంటే ముందు మోహన్ రాజా కేవలం డబ్బింగ్ సినిమాలు మాత్రమే తీస్తూ వచ్చాడు. దానితో ఈయన డబ్బింగ్ సినిమాలు తప్ప వేరే మూవీ లు తీయలేడు అనే పేరు కూడా ఇతనిపై ఉంది. ఇక తని ఒరివన్ మూవీ తో స్టేట్ సినిమాను తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఆ పేరును తొలగించుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన జయం రవి కి నయన తార కు కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం మోహన్ రాజ తని ఓరివన్ మూవీ కి కొనసాగింపుగా "తని ఒరివరి 2" అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో జయం రవి హీరో గా నటిస్తూ ఉండగా , నయన తారమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. తని ఒరివన్ మొదటి భాగంలో విలన్ పాత్ర అత్యంత కీలకంగా ఉండడంతో ఈ రెండవ భాగంలో ఆ విలన్ పాత్రను ఎవరు చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: