కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యభామ మూవీ పై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. సుమన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీకి మేకప్ దర్శకుడు శశికిరణ్ సమర్పికులుగా వ్యవహరించారు. క్రైమ్ థ్రిల్లర్ కథ తో ఈ సినిమా రూపొందింది. ఇక ట్రైలర్ మరియు పాటలు ఓకే ఓకే గా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ ఏడవ తారీఖున రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్ హడావిడి మరింత పెరిగింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 38 సెకండ్ల విడివి కలిగి ఉంది.‌ డాక్టర్ అయినటువంటి ఓ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి చంపడానికి ప్రయత్నించడం.. ఆమెను కాపాడే క్రమంలో సత్య చేతిలో ఆ అమ్మాయి ప్రాణం పోవడం. దీంతో సత్య ఉద్యోగం పోవడం జరిగాయి. అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే విషయాలను జాజ్  లేకపోయినా దర్యాప్తు చేసి అంతకుడిని పట్టుకోవడానికి సత్య ఎలా పోరాడింది... అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు గ్లామర్ తో మెప్పించిన కాజల్ ఇప్పుడు విజయశాంతి లాగా యాక్షన్ మూడ్లోకి దిగింది. ట్రైలర్ అయితే మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. మరి సినిమా ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కనుక బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇక నుంచి కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్యూటీకి ప్రజెంట్ హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. పెళ్లయి పిల్లలు కూడా ఉండడంతో ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో కాజల్ అగర్వాల్ కూడా రేడియోరియంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: