దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మోహన్ రాజా ఒకరు. ఈయన జగపతి బాబు , అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన హనుమాన్ జంక్షన్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని సంపాదించుకొని తెలుగులో సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన తమిళ పరిశ్రమ వైపు ఆసక్తి చూపించాడు. అందులో భాగంగా అక్కడ ఎన్నో సినిమాలను తెరకెక్కించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఇకపోతే కొంతకాలం క్రితం మోహన్ రాజా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు తని ఒరివన్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ మూవీ తర్వాత మోహన్ రాజా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మరో మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సంబంధించిన వార్తలు వచ్చి కేవలం కొన్ని రోజులు అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మోహన్ రాజా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అం

దులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ కి కథలు వినిపించడం , ఆయన ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం మోహన్ రాజ తని ఒరివన్ పార్ట్ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చేస్తూనే గ్యాప్ దొరికినప్పుడల్లా చిరు మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మోహన్ రాజ కంప్లీట్ చేయబోతున్నట్లు , ఆ తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: