గడిచిన రెండు రోజుల నుంచి ఎక్కువగా టాలీవుడ్ లో వినిపిస్తున్న పేరు బెంగళూరు రేవ్ పార్టీ.. ఈ వ్యవహారం పైన పోలీసులు తదుపరి స్టెప్ ఏంటి అనే విషయం చాలా కీలకంగా మారుతోంది. కేసులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడితే కచ్చితంగా బాధితులుగా వారిని పరిగణిస్తూ ఉంటారు.. బెంగళూరు వంటి ప్రాంతాలలో డ్రగ్స్ తీసుకొని పట్టబడిన సినీ తారలను కూడా చాలాసార్లు అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నవి. బెంగళూరు రేవు పార్టీలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్న విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.


టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ విషయంలో ఏదైనా లింక్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే హీరో శ్రీకాంత్ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం పైన శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అలాగే జానీ మాస్టర్ పేరు కూడా వినిపించగా ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా మంచు లక్ష్మి రేవ్ పార్టీ పైన స్పందిస్తూ.. ఆమె నటించిన యక్షిణి అనే వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడింది.


ఈ ట్రైలర్ ఈవెంట్లో మంచు లక్ష్మి మాట్లాడితే బాలీవుడ్ కు వెళ్లిపోయారా మీరు అనే ప్రశ్న ఎదురవగా నేను బాలీవుడ్ కు వెళ్లాను అని అందరూ అనుకుంటున్నారు కేవలం ముంబైకి మాత్రమే షిఫ్ట్ అయ్యాను అని తెలిపింది.. నాకు ఏ భాష అయినా ఒకటే హాలీవుడ్ లో కూడా చేశాను టాలీవుడ్ లో కూడా చేశారు. కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారని వెల్లడించింది. కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ తనకు సూట్ అయ్యే పాత్ర లేదేమో అందుకే తనని సినిమాలో తీసుకోలేదు అన్నట్లుగా తెలిపింది. ఇక రేవు పార్టీ గురించి మాట్లాడుతూ రేవ్ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు చాలా రోజుల తర్వాత తను నటించిన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది దాని గురించి మాత్రమే మాట్లాడదాం ఎవరు ఎక్కడికో వెళ్తే మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తెలిపింది మంచు లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: