జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్థాయి గ్లోబల్ స్థాయికి చేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతోంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లు కనిపించబోతున్నాడు. కాగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన

 బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్గా కనిపిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే సినిమా నుండి జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ లకి సంబంధించిన పోస్టర్స్ సైతం విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  ఇటీవల ఫస్ట్ సింగిల్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ సింగల్ సైతం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. కాగా దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్గా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్.  దానికి సంబంధించిన ఏవో ఒక వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా

 ఇప్పుడు దేవర స్టోరీ మొత్తం లీక్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి.  దేవరా సినిమాకి సంబంధించిన స్టోరీ మొత్తాన్ని ఒక జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేసినట్లుగా సమాచారం. అయితే ఇటీవల ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే దేవర సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలను పెంచేశారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఆయన దేవర సినిమాకి  సంబంధించిన కథ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. దేవర లో రౌడీల్లో ఒక వ్యక్తిగా నటించిన ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సముద్రం దగ్గర ఉండే పది ఊర్లకు కాపరిగా ఉంటాడని.. వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుండి వారిని రక్షిస్తాడని తెలిపాడు. అందరికి అండగా నిలబడే వ్యక్తి అని.. సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుందని.. అందర్నీ నరికే సీన్ హైలెట్ అని అన్నాడు. ఆ సీన్ కోసం ఏకంగా పదివేల మందితో ఫైట్ చేస్తాడని.. దీంతో సముద్రం అంతా రక్తంతో నిండిపోతుందని.. యాక్షన్ సీన్స్ లైవ్ లో చూసి తాము షాకయ్యామని.. తారక్ యాక్టి్ంగ్ నిజంగానే మైండ్ బ్లోయింగ్ అని తెలిపాడు. సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పడం తారక్ స్టైల్ అని.. దేవర రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ బద్దలైపోవడం ఖాయమంటూ స్టోరీ మొత్తం లీక్ చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: