టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాంటి ఈ ఫ్యామిలీ నిత్యం ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. మోహన్ బాబు మంచు లక్ష్మి మంచు విష్ణు ఏ కార్యక్రమానికి వెళ్లినా కూడా వాళ్ళ స్పీచ్ అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ట్రోలింగ్ బ్యాచ్ ఎప్పుడు కూడా వారి వెంటే తిరుగుతూ ఉంటుంది. వారి స్పీచ్ లను ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు. మోహన్

 బాబు చిరంజీవి పై విమర్శలు  చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మంచు విష్ణు సైతం మా ఎన్నికల సమయంలో ఇచ్చిన స్పీచ్ అప్పట్లో ఎంత ట్రోల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంచు లక్ష్మి మాత్రం ట్రోలింగ్  బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమెపై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక  ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా ఏది పోస్ట్ చేసిన ఏం చెప్పినా కూడా అది సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు తన

 పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అంతలా మంచు లక్ష్మిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆమె తన ఫ్యామిలీ పై జరిగే ట్రోలింగ్స్ పై స్పందిస్తూ.." మాకు రాజకీయాలు తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాం. అందుకే మమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. మేము మాట్లాడేది కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. కానీ తప్పదు. రెండిటినీ తీసుకోవాలి .మమ్మల్ని వాంటెడ్ గా ట్రోల్స్ చేస్తున్నారు అని నేను అనుకోను. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు నాకు మంచి స్నేహితులు. వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులు. మేమందరం కలిసి పెరిగిన వాళ్ళమే.  నాకు మా ఇంట్లో బాగానే ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటూ చెప్పకు వచ్చింది. అలా తన స్టైల్ లో ట్రోల్స్పైస్ స్పందించింది మంచు లక్ష్మి. దాంతో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: