ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కల్కి. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇందులో దీపికా పదుకొనే దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అమితాబచ్చన్ కమలహాసన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీరితోపాటు చాలామంది నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు అన్న వార్తలు ఎంతో కాలంగా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి .కాగా ఈ ఏడాది జూన్ 27న విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇందులో

 భాగంగానే ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ను హైదరాబాదులో గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు చిత్ర బృందం. కాగా ఇందులో భైరవ అనే పాత్ర లో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఇందులోనే ప్రభాస్ కారు బుజ్జి నో తాజాగా ప్రేక్షకులకు పరిచయం చేశారు చిత్ర బృందం. దానికి సంబంధించిన ప్రమోషన్స్ ను చేశారు. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ప్రభాస్ దర్శకుడు  తప్ప మిగిలిన ఏ ఇతర స్టార్ కాస్టింగ్ కనిపించలేదు. దీంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే ఇందులో దీపికా పదుకొనే ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో వీళ్లిద్దరి జోడిని ఆన్ స్క్రీన్

 పై చూడాలి అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు . దీపికా పదుకొనే  ప్రెగ్నెంట్ కావడంతో దానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకుంటుంది. అందుకే ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే దీపిక పదుకొనే సోషల్ మీడియాలో గాని మరి ఎక్కడైనా కల్కి సినిమాపై ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఇక ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవైపు చిత్ర బృందం కల్కి ప్రమోషన్ సర్ చేస్తున్న సమయంలో దీపికా మాత్రం దీనిపై స్పందించకపోవడంతో ఫాన్స్ మండిపడుతున్నారు.   దీపిక తన నెక్స్ట్ సినిమాలో షూటింగ్స్ లో బిజీగా ఉంది. మరొకవైపు ఆమె గర్భవతి కావడంతో ప్రమోషన్ కంటెంట్ కు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ప్రభాస్ కల్కి సినిమాను ఎక్కడా కూడా ప్రమోట్ చేయడం లేదని తెలుస్తోంది. మరి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ లో అయినా దీపికా కనబడుతుందా లేదా అన్నది తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే...!

మరింత సమాచారం తెలుసుకోండి: