పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మరికొన్ని సినిమాలు కూడా ఓకే చేశారు. అందులో సలార్ 2 కూడా ఒకటి. అయితే పోయిన ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా థియేటర్లలో  కాసుల వర్షాన్ని కురిపించింది. కే జి ఎఫ్ ఫెమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.

 ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటించగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ కు ఫ్రెండ్ గా నటించాడు. ప్రపంచవ్యాప్తంగా  సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఎండింగ్ లో మేకర్స్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని తెలిపారు. అయితే ప్రభాస్ తాజాగా నటిస్తున్న కల్కి  సినిమా షూటింగ్ పూర్తికాగానే సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ షూటింగ్ ఆగస్టులో స్టార్ట్

 చేయబోతున్నట్లు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ అప్డేట్ చూసిన ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.  తాజాగా ఫిల్మ్ వర్గాల నుండి సలార్ 2 సినిమా ఆగిపోయినట్లు సమాచారం.. ప్రభాస్, ప్రశాంత్ వీళ్లిద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు అనుకుంటున్నారు. అయితే ప్రశాంత నీల్ ,ఎన్టీఆర్ సినిమాకు కమిట్ అవ్వడంతో ఈ ఏడాది ప్రశాంత నీల్ ఆ సినిమాతో బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సలార్ 2 సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.  ఈ విషయం తెలియగానే అభిమానులంతా నిరాశ చెందుతున్నారు. ఇక  ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎప్పుడు రాబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: