కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ. హీరో నవీన్ చంద్ర మరో కీలక పాత్ర పోషిస్తున్న సినిమా సత్యభామ పై భారీ హైప్‌ ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాను అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బేబీ తిక్క, శ్రీనివాసరావు తక్కల పెళ్లి నిర్మించగా మేకర్ డైరెక్టర్ శశికిరణ్ సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాకు సుమన్ డైరెక్షన్ వహించారు. ఇక జూన్ 7న సత్యభామ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.." సత్యభామ మూవీ చాలా బాగా వచ్చిందని తెలుసు. ఈ మూవీకి మంచి టీం వర్క్ చేసింది. శశికిరణ్ తిక్క, బేబీ తిక్క.. వీళ్లు పేర్లలో తిక్క ఉంది గాని వాళ్ళ సినిమాకు ఓ లెక్క ఉంది. నవీన్ చంద్ర మంచి యాక్టర్. అతనికి ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలి. డైరెక్టర్ సుమన్ ఫస్ట్ ఫిలిం. ఆయనకు సత్యభామతో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్న.

ఇక మన సత్యభామ విషయానికి వస్తే.. అప్పుడు విజయశాంతి గారు రావులమ్మ కానీ ఇప్పుడు కాజల్ అగర్వాల్ సత్యభామ. ఇద్దరూ ఇద్దరే " అంటూ కామెంట్స్ చేశాడు అనిల్  రావిపూడి. ప్రజెంట్ అనిల్ రావిపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసిన పలువురు.." అప్పుడు రావులమ్మ సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో ఇప్పుడు సత్యభామ సినిమా కూడా ఆ విధంగానే షేక్‌ చేస్తుందని మేమందరం భావిస్తున్నాం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ యాక్టింగ్ ఒక ట్రైలర్ తోనే నిరూపించేశారు. కాజల్ ఏ పాత్రలో అయినా జీవిస్తుంది. ఆల్ ది బెస్ట్ కాజల్ బ్యూటీ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: