ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్ 2'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం సుమారు 600 కోట్లు వసూలు చేయడంతో ఇప్పుడు రెండో భాగం 1000 కోట్లు పైగా సునాయాసంగా వసూలు చేస్తుందని ఫ్యాన్స్ కి అంచనా ఉంది.అందుకే ఈ సీక్వెల్ మూవీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. 'సలార్'ని మించి సలార్‌- 2 మూవీలో కేజీఎఫ్ 2 లాగే ప్రభాస్ లోని బీస్ట్ ని, అతడి భారీ యాక్షన్ ని వీక్షించబోతున్నామని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాకింగ్ వార్త ఒకటి వచ్చింది.సలార్ హిట్ అయిన నేపథ్యంలో 'సలార్ 2' మరింత భారీ స్కేల్ పై వస్తుందన్న భావనలో ఉన్నవారికి నిజంగానే ఇది షాకింగ్ వార్త. అసలు సలార్ 2 ఉంటుందా ఉండదా? అంటే.. ఫిలింసర్కిల్స్ లో ఒక సెక్షన్ 'సలార్ 2' రద్దయినట్టేనని బలంగా గాసిప్స్ విపిస్తున్నాయి.


తెలుస్తున్న గాసిప్ ప్రకారం.. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సెట్స్ పైకి వెళ్లాల్సిన 'సలార్ 2' నిలిచిపోయింది. ఇది ఎప్పటికీ చిత్రీకరణకు వెళ్లదు అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ - ప్రభాస్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టేనని గాసిప్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న రాజా సాబ్ తర్వాత సలార్ 2 సినిమా కాకుండా మరో మూవీని ప్రారంభించాలని ప్రభాస్ భావిస్తున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఇప్పటికి 'సలార్ 2' సినిమాను పక్కన పెట్టాలని ప్రభాస్ నిర్ణయించారనే సమాచారం వినిపిస్తుంది. దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేనప్పటికీ, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు బిగ్ షాక్ లో ఉన్నారు. హోంబేల్ ఫిల్మ్స్ బ్యానర్‌లో కిరంగదూర్ ఈ మూవీని నిర్మించాల్సి ఉంది.సలార్ 1 సినిమాలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటించారు. అయితే సలార్ పార్ట్ 2 ఆగిపోయిందని వచ్చిన వార్తలు అధికారిక వార్తలు కావు. బలంగా విపిస్తున్న గాసిప్స్ అంతే. ఇక ఈ తాజా పుకార్లపై చిత్రబృందం ఇంకా స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: